ELR: చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామంలో మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఇస్లావతు బాలాజీ, దేశావతు శ్రావణికి చెందిన 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇరువురిపై పరారీ కేసు నమోదు చేసినట్లు వివరించారు. పాత కేసులో పరారీలో ఉన్న వాక దేవాంజనేయులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచామన్నారు.