E.G: కొవ్వూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి పలు సమస్యలకు సంబంధించి ఆర్జీలను స్వీకరించారు. తక్షణమే పరిష్కారం చూపే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటపల్లి సూర్యనారాయణ పాల్గొన్నారు.