NDL: శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం శనివారం ఉదయం 6 గంటల సమయానికి 862.90 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 114.9952 టీఎంసీలుగా నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది శ్రీశైల జలాశయానికి వరద వేగంగా వచ్చి చేరింది. ప్రస్తుతం అంతే వేగంగా డ్యామ్ నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కాగా డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.