KKD: మాటలు కలుపుతూ నమ్మిస్తారు.. దృష్టి మరల్చి రెప్పపాటులో సొత్తు మాయం చేసేస్తారు. బస్సులు, ఆటోల్లో ప్రయాణం చేసే వారే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అన్నవరం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 106.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.