NLR: డిసెంబర్ 31వ తేదీ మంగళవారం విడవలూరు మండలంలోని అన్ని పంచాయితీల్లో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీడీవో నగేష్ కుమారి శనివారం తెలిపారు. జనవరి ఒకటవ తేదీ సెలవు దినం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సచివాలయం సిబ్బంది ఇంటికి వద్దకు వచ్చి అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేస్తారన్నారు.