TPT: సూళ్లూరుపేట బాపూజీ కాలనీలోని ఎస్టీ కాలనీలో 235, 237 వార్డులో సోమవారం ఉదయం పెన్షన్లు పంపిణీ చేశారు. బూత్ ఇన్ఛార్జ్ వల్లూరు శ్యామ్ సుందర్, కట్టా జనార్ధన్ యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.పెన్షన్లతో పాటు, కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డులతో రేషన్ అక్రమాలకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.