TPT: తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టు అయిన ఇద్దరు నిందితులకు నెల్లూరు ఏసీబీ కోర్టు 4 రోజులు కస్టడీకి అనుమతించారు. ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యంను ఈనెల 9 నుంచి 12 వ తేదీ వరకు సీబీఐ సిట్ కస్టడీలో విచారించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. కాగా ఏ16 బెయిల్ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.