SS: చిన్నగొట్టిగల్లు మండలం ఎగవూరు, ఉలసలవారిపల్లి గ్రామాల్లో ఆదివారం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. మామిడి, టమాటా, వరి పంటలను దాడి చేసిన ఏనుగుల గుంపు ఈదల చెరువుపల్లిలో పంటపొలాల్లో రక్షణగా ఉన్న కూసాలను ధ్వంసం చేశాయి. రాత్రివేళల్లో ఏనుగుల సంచారం పెరుగుతున్నందున సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.