SKLM: కిశోరి వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం గుజరాత్ పేటలోని ఐసీడీఎస్ కార్యాలయంలో కిశోరి వికాసం-2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. కిశోరి వికాసం పునఃప్రారంభం ప్రతి బాలిక భవిష్యత్తును మెరుగుపరచడానికి ఓ మంచి అవకాశమన్నారు.