అన్నమయ్య: సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల ఎదుటే మొదలైన గొడవను పోలీసులు చెదరగొట్టినా, తర్వాత మరోచోట మళ్లీ ఇరువర్గాలు దాడులకు దిగాయి. ఈ ఘటనలో కిషోర్, పవన్ తీవ్రంగా గాయపడగా రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించబడ్డారు.