VSP: చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ బుధవారం తెలిపారు. ఈ రూట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రజలు, వన్యప్రాణుల క్షేమం కోసం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసామన్నారు.