KDP: లింగాల పోలీస్ స్టేషన్ ఎదుట రైతులతో కలిసి శనివారం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ధర్నాకు దిగారు. తరచూ మోటార్ల వైర్లు దొంగతనానికి గురవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులు ఫిర్యాదులు ఇస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫోన్ ద్వారా ఎస్పీతో మాట్లాడారు. 24 గంటల్లో న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.