ATP: పామిడికి చెందిన అనూష అనే కుస్తీ క్రీడాకారిణి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకం సాధించింది. దీంతో శనివారం అనూషను తల్లిదండ్రులు, శిక్షకుడు అభినందించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. అంతర్జాతీయ కుస్తీ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధిస్తానని పేర్కొంది.