ఏలూరు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 4,000 మంది అంగనవాడీ వర్కర్స్కు ఈఎస్ఐ కల్పించాలంటూ ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు సామయ్య డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన పీజీఆర్ఎస్లో సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్ తీవ్ర అనారోగ్యాలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, స్త్రీ ఈఎస్ఏ పథకం వర్తింప చేయాలని కోరారు.