KDP: గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే బ్రేక్ ఫెయిల్ అయిన లారీ బైక్ను ఢీ కొట్టింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీ నుంచి డ్రైవర్ కిందకు దూకేయడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడు లక్కిరెడ్డిపల్లె మండలం దాదేపల్లికు చెందిన లక్ష్మయ్యగా గుర్తించారు.