BDK: ఈ నెల 3న CM రేవంత్ రెడ్డి పర్యటన దాదాపు ఖరారైనట్లు MLA జారె ఆదినారాయణ తెలిపారు. గత నెల 21, అనంతరం 30న చండ్రుగొండ మండలం బెండాలపాడులో సీఎం పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లు చేశారు. అయితే అనేక కారణాలతో సీఎం సభ రెండుసార్లు వాయిదా పడింది. కాగా, బెండాలపాడుతో పాటు చండ్రుగొండలోని హెలీప్యాడ్ వద్ద, దామరచర్ల సభాస్థలిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.