SKLM: లావేరు (M) మురపాక రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం పశుసంవర్ధక శాఖ జిల్లా ఉప సంచాలకులు డా. డి.గణపతిరావు ఆధ్వర్యంలో పశుగణాభివృద్ధి సంస్థ సహాయంతో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా 58 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స చేశారు. అలాగే 351 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు.