GDWL: కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె, పూజారి తాండ, ఇరికిచెడు గ్రామాల ప్రజలు రోడ్లు, బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు జంబయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఆయన సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వర్షం పడినప్పుడు రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారడంతో వాహనదారులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.