MNCL: 2024- 25 సంవత్సరంలో సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు కేటాయించడం విడ్డూరంగా ఉందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. గత ఏడాది కేటాయించిన సుమారు రూ.2 వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలపకుండా ఈ ఏడాది కూడా రూ.4,034 ఎక్కడ ఖర్చు పెడతారో వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.