KRNL: నగర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి. విశ్వనాథ్ బుధవారం తెలిపారు. తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై 08519-221847 నంబరు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.