VZM: గంట్యాడ మండలం డికె పర్తి పంచాయతీ పరిధి భీమవరం గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఆదివాసీ JAC జిల్లా ఛైర్మన్ తుమ్మి అప్పలరాజు దొర కోరారు. గురువారం భీమవరంలో ఆయన మాట్లాడారు. రెండు గ్రామాలకు నీరందించే తాటిపూడి జలాశయం ఆనుకుని ఈ గ్రామం ఉన్నా గ్రామస్తులకు తాగునీరు ఇక్కట్లు తప్పడం లేదని చెప్పారు. అలాగే గ్రామానికి రహదారి సౌకర్యం లేదన్నారు.