VSP: మత్స్యకారుడు మేరుగ లక్ష్మణరావు మృతి చెందిన నేపథ్యంలో, ఆయన భార్య మేరుగు సత్యవతికి సోమవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో 6.9 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్నవరం గ్రామానికి చెందిన డ్రైవర్లు, కాలశీలు 4.5 లక్షలు సమకూర్చగా, ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పీ.సీ. అప్పారావు ఈ మొత్తాన్ని అందజేశారు.