NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామ సమీపంలో ఇవాళ ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గేర్ బాక్స్ స్ట్రక్ అయ్యి అక్కడే ఆగిపోయింది. చేసేదేమీ లేక డ్రైవర్ మరో బస్సుకి వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఆర్టీసీ బస్సు కొండ ప్రాంతంలో ఆగిపోవడంతో ప్రయాణికులు కొద్ది దూరం నడిచి వెళ్లారు. నూతన బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.