కృష్ణా: కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వెన్నెన్నపూడి గ్రామం ZPHSలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను పాఠశాల HM వై.మాధవ కుమార్ ప్రారంభించారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కే.వీ. నాంచారయ్య మాట్లాడుతూ.. ఈ సెలక్షన్స్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 7, 8, 9 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.