VZM: విద్యార్థులు చదువుతోపాటుగా క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చెయ్యాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. సోమవారం పట్టణంలో నేషనల్ స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి ప్రైవేటు స్కూళ్ల విద్యార్థుల కోకో పోటీలను ఆయన ప్రారంభించారు. స్కూల్ డైరెక్టర్ డా. ఎమ్.వి.ఎన్. వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.