ELR: బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై దాడులు, నిర్భంధాలు, అక్రమ పోలీసు కేసులు ఆపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులకు అండగా ఈనెల 29న జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ముందు, 30న ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శనివారం బుట్టాయిగూడెంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ధర్నాను విజయవంతం చేయాలన్నారు.