కోనసీమ: అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ హరీష్ బాలయోగి పర్యటించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి భోజన సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.