PLD: పల్నాడు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతాన్ని కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం సందర్శించారు. జలపాతం, జలదారల వద్దకు చేరుకొని అక్కడ అందాలను తిలకించారు. ఇటీవల పల్నాడు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె నేడు ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. ఈ ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించారు.