SKLM: మందస మండలంలోని దామోదర్ సాగర్ ప్రాజెక్టును ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌తో కూడిన పలువురు అధికారుల బృందం ఇవాళ పరిశీలించారు. రూ. 5 కోట్ల నిధులకు పరిపాలన ఆమోదం పొంది వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి టెండర్లు పిలిపించుటకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రాజెక్టుకు ఉన్న ఇతర సమస్యలను స్థానిక రైతులు చీఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చారు.