ప్రకాశం: కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకునేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ సేవా భావం కలిగి ఉండాలన్నారు.