అమరజీవి జలధార పథకం ద్వారా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు కూడా త్రాగునీరు అందుతుందని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. ఆయన సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది, కేశవ దాసుపాలెం గ్రామాలలో జలధార పథకంలో భాగంగా నూతనంగా నిర్మించనున్న సురక్షిత త్రాగు నీటి ట్యాంకుల నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.