W.G: వాహన చోదకులు రహదారి నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని జిల్లా రవాణాధికారి కేఎస్ఎంవీ కృష్ణారావు ఒక ప్రకనటనలో తెలిపారు. చరవాణుల్లో మాట్లాడుతూ.. వాహనాలు నడపడం వల్ల అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. వేగం కంటే ప్రాణం ముఖ్యమనే విషయం, మనపై మన కుటుంబం ఆధారపడి ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు.