ELR: ఉంగుటూరు మండలానికి స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎంపీడీవో మనోజ్ తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్క్రాప్ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉంగుటూరు మండల పరిషత్ గ్రామంలో పారిశుద్ధ్య స్థితిని మరింత మెరుగుపరిచే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. స్వచ్ఛ రథం వాహనం గురించి వారికి వివరించారు.