NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ డైట్లో బుధవారం భారతీయ భాషా ఉత్సవం ఘనంగా నిర్వహించబడినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలియజేశారు.మొదట సుబ్రహ్మణ్య భారతి చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన యొక్క జీవిత విశేషాలను, ఆయన సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.