VSP: సింహాచలం దేవస్థానం ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్. సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆమె అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిధిలో కప్పస్తంభం ఆలింగనం చేసి, బేడా ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో దర్శనం చేసుకుని, వేదపండితుల వేదాశీర్వచనాలు స్వీకరించారు.