NLR: మనుబోలులోని విశ్వనాథ స్వామి ఆలయం వద్ద ఆదివారం మరోసారి నాగేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ దృశ్యాన్ని తిలకించిన భక్తులు ఓం నమః శివాయ శివాయ నమః అంటూ భక్తితో మునిగిపోయారు. గతంలోనూ ఇలాగే నాగుపాములు ఇక్కడికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.