ELR: హోం మంత్రి అనితతో దెందులూరు అసెంబ్లీ జనసేన ఇంఛార్జ్ డా.ఘంటసాల వెంకటలక్ష్మి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దెందులూరు అసెంబ్లీ పరిధిలో నెలకొన్న పరిస్థితులపై మంత్రికి వివరించడం జరిగిందన్నారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని వెంకటలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు ఉన్నారు.