Vsp: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సర్వసభ్య సమావేశం బుధవారం జరగనున్నది. మేయర్ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చర్చించేందుకు 46 అంశాలతో ప్రధాన ఎజెండా, 21 అంశాలతో అనుబంధ ఎజెండా తయారుచేసి సభ్యులకు అందజేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేసారు.