KDP: ఎర్రగుంట్ల మండలం కమలాపురం వెళ్లే రహదారిలోని తిప్పలూరు వద్ద సోమవారం రాత్రి కంటైనర్, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోగా అతడిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నాలు చేశారు. రోడ్డు మధ్యలో రెండు లారీలు ఢీకొనడంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.