శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ నర్తు రామారావును మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్ఛాపురంలో జరిగే ‘అన్నదాత పోరు’ ర్యాలీకి వెళ్లకుండా అడ్డగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నందుకు కేసులు కడతామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదమన్నారు.