GNTR: గుంటూరులో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు శుక్రవారం అవగాహన నిర్వహించి, పోలీస్ శాఖ జారీచేసిన క్యూఆర్ కోడ్ నెంబర్లను ఎస్పీ శుక్రవారం అందజేశారు. గుంటూరులో 10 వేల ఆటోలకు పోలీస్ విభాగం తరఫున క్యూ ఆర్ కోడ్‌తో కూడిన స్టిక్కర్లు ఇచ్చామన్నారు.