విశాఖ పెదవాల్తేరులో గల శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎం. వి. రాజశేఖర్ ఈ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.