అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని సుద్దలవాండ్లపల్లి రోడ్డులో డ్రైనేజీ వరి మడిని తలపిస్తోంది. మున్సిపల్ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచి పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు, దోమల బెడద ఎక్కువై రోగాల బారిన పడుతున్నామని, పరిస్థితి దారుణంగా తయారైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.