KMR: జిల్లాలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, నిండిన ప్రాజెక్టులు, చెరువులు, పాత ఇళ్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను ముందుగానే గుర్తించాలని కలెక్టర్ తెలిపారు.