TPT: తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు బుధవారం సైతం సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సైతం సెలవు వర్తిస్తుంది. సోమ, మంగళవారం సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.