SS: కదిరి మున్సిపాలిటీలోని కుటాగుల్ల వద్ద ఎన్హెచ్- 42పై ఉన్న రైల్వే గేట్ నంబర్ 41ను డిసెంబర్ 13, 14 తేదీల్లో మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు రోజులు ట్రాక్ మెయింటెనెన్స్ పనులు, తనిఖీలు జరగనున్నాయని ఎస్ఎస్ఈ పీడబ్ల్యూ శివం మాథుర్ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను నారాయణమ్మ బ్రిడ్జి దారిగా మళ్లించారు. ప్రజలు సహకరించాలని కోరారు.