GNTR: ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు, ఫిరంగిపురం-2 రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వాసంతి పాల్గొని మాట్లాడుతూ.. ప్రస్తుత పత్తి పంటల్లో తెల్ల దోమ ప్రభావం అధికంగా గమనించబడుతోందని తెలిపారు. దీని నివారణకు పోలో, ఒబెరాన్ వంటి పురుగు మందులను పిచికారి చేయవచ్చని రైతులకు వివరించారు.