VZM: నెల్లిమర్ల మండలంలోని అలుగోలు గ్రామంలో భూములకు సంబంధించిన రీసర్వే కోసం బుధవారం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. గ్రామ పరిధిలో ఉన్న 2,200 ఎకరాల రీసర్వే కోసం గ్రామ పెద్దలు, రైతుల నుంచి సలహాలు తీసుకున్నారు. రీసర్వే నిబంధనలు తహసీల్దార్ శ్రీకాంత్ రైతులకు వివరించారు. ఈనెల 3 నుంచి ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.