ATP: గుంతకల్లు పట్టణంలోని జీబీసీ కాలవ నుండి భీమిరెడ్డి నగర్ వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం కాలనీవాసులు, ఎస్సీ ఎస్టీ రక్షణ సమితి సభ్యులు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్‌కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నూతన సీసీ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు.