ప్రకాశం: కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో రోడ్డుపై ఉన్న చెప్టా నేలకు సమాంతరంగా ఉండడంతో మురుగునీరు కాలువలలో గుండా పోయే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రోడ్డు మీద మురుగునీరు నిలవడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు సమస్యను తెలియపరచినా పరిష్కరించలేదని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చెప్టా నిర్మాణానికి చొరవ చూపాలని కోరుతున్నారు.